కరోనా ఎఫెక్ట్ తో నాగార్జున షూటింగ్ క్యాన్సిల్

Published on Feb 06,2020 09:33 PM

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో పలు షూటింగ్ లు వాయిదా పడుతున్నాయి వాటిలో అక్కినేని నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ చిత్రం కూడా ఉంది. తాజాగా నాగార్జున వైల్డ్ డాగ్ అనే యాక్షన్ ఫిలిం లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా షెడ్యూల్ ని థాయిలాండ్ లో ఏర్పాటు చేశారట చిత్ర బృందం. అయితే తీరా వెళదామని అనుకున్న సమయంలోనే కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని భయకంపితులను చేస్తూ పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తుండటంతో పలు షూటింగ్ లు వాయిదా పడ్డాయి.

ఇక థాయిలాండ్ లో కూడా కరోనా వైరస్ బయటపడటంతో వైల్డ్ డాగ్ షూటింగ్ క్యాన్సిల్ చేసారు. నాగార్జున ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నటిస్తుండగా నాగ్ సరసన హాట్ భామ సయామీ ఖేర్ నటిస్తోంది. ఇక ఈ సినిమా దిశ హత్యల నేపథ్యంలో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ఎఫెక్ట్ లేదని కన్ఫర్మ్ అయ్యాక అక్కడ షూటింగ్ కి వెళ్లనున్నారట.