భయపడుతున్న నాగార్జున

Published on Jan 25,2019 12:54 PM

అక్కినేని బయోపిక్ తీయాలంటే భయపడుతున్నాడు కింగ్ నాగార్జున . తెలుగునాట బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే . మహానటి సంచలన విజయం సాధించడంతో మరింత ఊపు పెరిగింది దాంతో దాదాపు డజన్ బయోపిక్ లు షూటింగ్ లో ఉన్నాయి ఒక్క తెలుగులోనే , అయితే ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయి డిజాస్టర్ కావడంతో వాళ్లలో కొంతమంది భయపడుతున్నారు . 

ఇక నాగార్జున భయానికి వస్తే ....... ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో సుమంత్ అక్కినేని గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు . దాంతో అక్కినేని బయోపిక్ తీయాలని ఒత్తిడి చేస్తున్నారట . అంతకుముందే అక్కినేని బయోపిక్ చేసేది లేదు అంటూ ప్రకటించాడు నాగ్ . కానీ సుమంత్ లుక్ చూసాక చాలామంది నాగ్ ని అక్కినేని బయోపిక్ తీసే ఆలోచన చేయమని కోరారట ! నాగ్ కూడా ఆలోచన చేసాడట కానీ ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ కావడంతో ఆ ప్రయోగం చేసేది లేదని డిసైడ్ అయ్యాడట .