ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నాగార్జున

Published on Dec 27,2019 10:59 PM

కింగ్ నాగార్జున సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు ఈరోజు. మన్మథుడు 2 డిజాస్టర్ కావడంతో తన తదుపరి చిత్రం గురించి పెద్దగా ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక ఈరోజు '' వైల్డ్ డాగ్ '' అంటూ ఓ ఫస్ట్ లుక్ ని విడుదల చేసాడు. ఆ లుక్ చూసి నాగార్జున ఫ్యాన్స్ సంతోషిస్తుండగా మిగతా వాళ్ళు షాక్ అవుతున్నారు. నాగార్జున ఈ వైల్డ్ డాగ్ చిత్రంలో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నటిస్తున్నాడు. వెరైటీ లుక్ తో నాగార్జున మెస్మరైజ్ చేస్తున్నాడు. కొత్తతరం దర్శకుడు అహీతోష్ సోలొమన్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ దాదాపుగా షూటింగ్ కూడా సగం పూర్తి కావడం విశేషం. సడెన్ గా ఇలాంటి ప్రకటనతో సంచలనం సృష్టించాడు నాగ్. కొత్త దర్శకుడితో సినిమా చేయడం వల్ల తప్పకుండా తన కెరీర్ కు మంచే జరుగుతుందని భావిస్తున్నాడు నాగార్జున. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్ర అంటే నాగార్జున కొత్త లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నాడన్న మాట! మొత్తానికి మన్మథుడు 2 డిజాస్టర్ తో నాగార్జున కొత్త తరహా ప్రయోగం చేస్తున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా కొత్త దర్శకులతోనే నాగార్జున అనేక ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే.