తాతా మనవడి గా నాగార్జున , నాగచైతన్య

Published on Jan 19,2019 12:29 PM

తండ్రీ కొడుకులైన నాగార్జున - నాగచైతన్య తాతా - మనవడిగా నటించడానికి రెడీ అవుతున్నారు . 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ఫ్రీక్వెల్ గా బంగార్రాజు రూపొందుతోంది . కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం ఆ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచింది దాంతో అప్పుడే బంగార్రాజు టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు నాగార్జున . అయితే కథ మాత్రం ఇప్పుడు సెట్ అయ్యింది దాంతో ఈ ఏప్రిల్ లో బంగార్రాజు సెట్స్ మీదకు వెళ్లనుంది . 

నాగార్జున బంగార్రాజు గా తాత పాత్రలో కనిపించనున్నాడు అలాగే మనవడి పాత్రలో నాగచైతన్య నటించనున్నాడు . కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథ నాగ్ కు నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . ఏప్రిల్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . ఈలోపు ప్రీ ప్రొడక్షన్ పనులు అన్నీ కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా చిత్రం లో నటించగా నాగచైతన్య 'రారండోయ్ వేడుక చూద్దాం '' చిత్రంలో నటించాడు .