నాగార్జున మోసం చేశాడంటున్న రేఖ

Published on Feb 26,2020 03:04 PM

కింగ్ నాగార్జున నన్ను మోసం చేసాడని సంచలన ఆరోపణలు చేసింది ఆనందం ఫేమ్ రేఖ. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది రేఖ. ఆ తర్వాత ఒకటో నెంబర్ కుర్రాడు , జానకి వెడ్స్ శ్రీరామ్ , మన్మథుడు , దొంగోడు తదితర చిత్రాల్లో నటించింది రేఖ. అయితే హీరోయిన్ గా నటిస్తున్న రేఖని మన్మథుడు చిత్రంలో ఒక పాటలో నటిస్తే ఆ తర్వాత తన చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని అన్నాడట.

దాంతో మన్మథుడు చిత్రంలో ఒక పాటలో నటించింది రేఖ. అయితే మన్మథుడు పెద్ద హిట్ అయ్యింది కానీ నాగార్జున మాత్రం రేఖ కు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వలేదు. కట్ చేస్తే ఇప్పుడు రేఖ రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు ఎలాగూ హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వలేదు కనీసం ఇప్పుడైనా సరే నాకు మీ సినిమాలో ఏదో ఒక ఛాన్స్ ఇవ్వండి అని నాగార్జునని వేడుకుంటోంది రేఖ . మరి నాగార్జున ఛాన్స్ ఇస్తాడో ? లేదో చూడాలి.