విజయ్ దేవరకొండ డైరెక్టర్ తో నాగచైతన్య

Published on Dec 14,2019 05:02 PM

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన గీత గోవిందం చిత్రాన్ని చేసిన పరశురామ్ తో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించనున్న చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా 14 రీల్స్ అధినేతలు కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 14 రీల్స్ పతాకంపై పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు అయితే ఆ తర్వాత వరుస ప్లాప్ లతో ఆ బ్యానర్ వెనుకబడిపోయింది.

కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పరశురామ్ అగ్ర హీరోలతో సినిమాలు చేయాలనీ చూసాడు కానీ ఏ స్టార్ హీరో కూడా పరశురామ్ కు ఛాన్స్ ఇవ్వలేదు దాంతో అక్కినేని నాగచైతన్య వద్దకు వెళ్ళాడు. కట్ చేస్తే పరశురామ్ చెప్పిన కథ నాగచైతన్య కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇంకేముంది ఈ కాంబినేషన్ లో సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చారు 14 రీల్స్ అధినేతలు. నాగచైతన్య తాజాగా మేనమామ వెంకటేష్ తో కలిసి నటించిన వెంకీ మామ నిన్న విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.