కెప్టెన్ లుక్ లో అదరగొట్టిన నాగచైతన్య

Published on Nov 24,2019 02:29 PM

నిన్న అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు కావడంతో నిన్న సాయంత్రం వెంకీ మామ చిత్రంలోని స్పెషల్ టీజర్ ని విడుదల చేసారు. ఆ టీజర్ ప్రేక్షకులను అలరించేలా ఉంది. కెప్టెన్ లుక్ లో నాగచైతన్య అదరగొట్టాడు. సైనికుడి పాత్రలో నాగచైతన్య నటిస్తున్నాడు. నాగచైతన్య పుట్టినరోజున వెంకీ మామ లోని లుక్ ని విడుదల చేసి అక్కినేని ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తారు.  బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నాగచైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. నిజ జీవితంలో మామా - అల్లుళ్ళు అయిన వెంకటేష్ - నాగచైతన్య లు సినిమాలో కూడా మామా - అల్లుళ్ళు గా నటించడం విశేషం. ఇక వెంకటేష్ కు జతగా హాట్ భామ పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది.