నాగబాబుని 9 మంది రిజెక్ట్ చేశారట

Published on Nov 27,2019 02:57 PM

మెగా బ్రదర్ నాగబాబు 9 మందిని ప్రేమిస్తే ఆ 9 మంది అమ్మాయిలు కూడా తిరస్కరించారట దాంతో నేను కూడా లవ్ ఫెయిల్యూర్ జాబితాలో ఉన్నవాడిని అంటూ వ్యాఖ్యానించాడు. తాజాగా నాగబాబు ఓ ఛానల్ లో నిర్వహిస్తున్న ఓ కామెడీ షోలో పాల్గొన్నాడు. జబర్దస్త్ షో నుండి వెళ్ళిపోయిన నాగబాబు ఓ ప్రముఖ ఛానల్ లో నిర్వహిస్తున్న షోకు జడ్జిగా వెళ్ళాడు. అయితే ఈ షో జబర్దస్త్ లా మాత్రం అస్సలు ఆకట్టుకోవడం లేదు.

ఇక ఇదే షోలో తన లవ్ ఫెయిల్యూర్స్ గురించి కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తంగా తొమ్మిది మందికి లైన్ వేసాడట నాగబాబు అయితే అందులో ఒక్కరు కూడా నాగబాబు కి పడలేదు దాంతో తన తన విఫల ప్రేమ గురించి చెబుతూ నాదంతా వన్ సైడ్ లవ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈరోజుల్లో కూడా ఎక్కువగా వన్ సైడ్ లవ్ అనే విషయం తెలిసిందే.