విభేధాలతోనే నాగబాబు బయటకు వచ్చాడట

Published on Nov 22,2019 03:55 PM

జబర్దస్త్ నుండి నేను బయటకు వచ్చానని , అయితే నాకు జబర్దస్త్ టీమ్ కు సైద్ధాంతిక విబేధాలు వచ్చాయని దాంతో బయటకు రావాల్సి వచ్చిందని బాంబ్ పేల్చాడు మెగా బ్రదర్ నాగబాబు. గతకొద్ది రోజులుగా నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోతున్నాడని పుకార్లు షికారు చేసాయి. ఇక తాజాగా రెమ్యునరేషన్ విషయంలో తేడాలు వచ్చాయని అలాగే అగ్రిమెంట్ గురించి విబేధాలు వచ్చాయని దాంతో మనస్తాపం కు గురైన నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్ళిపోతున్నాడని వార్తలు వచ్చాయి అయితే అవి వాస్తవం కాదని అంటున్నాడు నాగబాబు.

రెమ్యునరేష్ పెద్ద మ్యాటర్ కాదని కాకపోతే టీమ్ కు నాకు సైద్ధాంతిక విబేధాలు వచ్చాయని అందుకే జబర్దస్త్ నుండి తప్పుకున్నానని , ఏడేళ్ల పాటు జబర్దస్త్ తో ప్రయాణం చేసానని సంతోషాన్ని వ్యక్తం చేసాడు నాగబాబు. అంతేకాదు నా యూట్యూబ్ ఛానల్ లో మిగిలిన విషయాలు చెబుతానని అన్నాడు అంటే ఇంకా ఏదో జరిగిందన్న మాట ! అదేంటి అన్నది త్వరలోనే నాగబాబు చెప్పనున్నాడు.