శివాజీరాజా పై మండిపడిన నాగబాబు

Published on Apr 15,2019 04:54 PM

నరసాపురం పార్లమెంట్ సభ్యుడిగా నన్ను ఎన్నుకోవద్దంటూ అక్కడి ఓటర్లకు పిలుపునిచ్చిన నటుడు శివాజీరాజా పై ఆగ్రహం వ్యక్తం చేసాడు మెగా బ్రదర్ నాగబాబు . జనసేన తరుపున నాగబాబు నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే . కాపు కులస్థుల ఓట్లు పుష్కలంగా ఉన్న నరసాపురం నుండి గెలుస్తానని నమ్మకంతో అక్కడ పోటీ చేసాడు నాగబాబు . అయితే ఇప్పుడు మాత్రం ఆ నమ్మకం పోయింది పాపం ఎందుకంటే ఓటింగ్ సరళి అలాగే ప్రచారంలో నాగబాబు తెలుసుకున్న వాస్తవాలతో . 

శివాజీరాజా మా అధ్యక్షుడిగా ఆశించిన స్థాయిలో పనిచేయలేదని అందుకే అతడికి కాకుండా నరేష్ ప్యానల్ కు మద్దతు ప్రకటించానని , అయినా శివాజీరాజా నాకు ఓటెయ్యొద్దు అని పిలుపు ఇవ్వగానే ఓటేయకుండా పోతారా ? అంటూ అసలు శివాజీరాజా కు అంత సీనుందా ? అంటూ మండిపడ్డాడు నాగబాబు . ఒకవేళ పార్లమెంట్ కు ఎన్నికైతే తప్పకుండా అద్భుతమైన అభివృద్ధి చేసి చూపెడతానని అంటున్నాడు నాగబాబు .