జబర్దస్త్ పై సంచలన ఆరోపణలు చేసిన నాగబాబు

Published on Dec 01,2019 06:17 PM

మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షోపై సంచలన ఆరోపణలు చేసాడు. నాగబాబు జబర్దస్త్ షో నుండి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. వెళ్లపోయిన తర్వాత కారణాలు చాలా ఉన్నాయని వాటిని తప్పకుండా నా యూట్యూబ్ లో చెబుతానని చెప్పిన మాట ప్రకారం తొలివిడత ఆరోపణలు చేసాడు నాగబాబు. జబర్దస్త్ షో పై కార్పొరేట్ నీడ పడిందని అందుకే టీమ్ లీడర్ వేణు పై దాడి జరిగినప్పుడు మల్లెమాల యాజమాన్యం కానీ ఈటివి కానీ పట్టించుకోలేదని అయితే ప్రోగ్రాం పై కేసులు నమోదు అయితే మాత్రం లీగల్ గా వెంటనే స్పందించారని సంచలన వ్యాఖ్యలు చేసాడు.

టీమ్ లీడర్ లకు అండగా ఉంది నేనే ! అంతేకాని మల్లెమాల కానీ ఈటీవీ యాజమాన్యం కానీ లేదని చెప్పాడు. అంతేకాదు జబర్దస్త్ లో దళారులు ఉన్నారని దాంతో షోలో పాల్గొన్న వాళ్లకు కనీసం సరైన భోజనం కూడా పెట్టేవాళ్ళు కాదని మరింత సంచలనం సృష్టించాడు. ఈ విషయాలన్నీ శ్యామ్ ప్రసాద్ కు తెలియవనే అనుకుంటున్నాను , ఒకవేళ తెలిసే జరిగి ఉంటే ఏం చేయలేమని సెలవిచ్చాడు నాగబాబు. జబర్దస్త్ పై నాగబాబు చేసిన వ్యాఖ్యల మూలంగా ఇది చిలికి చిలికి గాలివాన లా మారే ప్రమాదం అయితే ఉంది.