నాగబాబు అదిరింది షో అదిరిపోద్దా !

Published on Dec 12,2019 05:00 PM

మెగా బ్రదర్ నాగబాబు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ బుల్లితెరపై సంచలనం సృష్టించింది. అయితే ఏడున్నర సంవత్సరాలుగా జబర్దస్త్ తో పెనవేసుకున్న అనుబంధంని వదులుకొని ఆ షో నుండి వచ్చేసాడు. తాజాగా జీ తెలుగు ఛానల్ కోసం '' అదిరింది '' అనే కామెడీ షో చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ప్రోమో అయితే అదిరిపోయేలాగే ఉంది. నాగబాబు ఎంట్రీ విజువల్స్ సినిమాని తలపించాయి అలాగే డైలాగ్ కూడా బాగా పేలింది , అయితే ప్రోమో అదిరింది కానీ ఈ కామెడీ షో జబర్దస్త్ ని మించి పోయేలా అదిరిపోద్దా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దానికి ఈ ఆదివారం రోజున సమాధానం రానుంది.

ఎందుకంటే డిసెంబర్ 15 న అదిరింది షో స్టార్ట్ కానుంది జీ తెలుగు ఛానల్ లో. ఆదివారం రోజున రాత్రి 9 గంటలకు ఈ షో ప్రారంభం కానుంది. జబర్దస్త్ గురు , శుక్ర వారాల్లో అది కూడా 9గంటల 30 నిమిషాల తర్వాత వస్తుండగా అదిరింది మాత్రం ప్రతీ ఆదివారం రోజున రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. జబర్దస్త్ నుండి వెళ్ళిపోయిన తర్వాత జీ తెలుగు లోనే ఓ షో చేసాడు నాగబాబు అయితే అది అంతగా పేలలేదు మరి ఈ అదిరింది షో అదిరిపోతుందా ? లేక చతికిల బడుతుందా ? అన్నది ఒక వారం టెలికాస్ట్ అయితే కానీ చెప్పలేం.