వెంకీ కుడుములతో నాగశౌర్య గొడవ ఇంకా పెరిగేలా ఉందే !

Published on Feb 04,2020 07:33 PM

ఛలో వంటి సూపర్ హిట్ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు వెంకీ కుడుముల. ఆ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా నిర్మించింది నాగశౌర్య అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా విడుదల అయ్యాక నాగశౌర్య కు వెంకీ కుడుములకు చెడింది. దాంతో అప్పటి నుండి ఎడమొహం పెడమొహం గానే ఉంటున్నారు ఈ ఇద్దరూ. కట్ చేస్తే అశ్వద్దామ చిత్రం విడుదల కావడంతో వెంకీ కుడుములపై మరోసారి నోరు పారేసుకున్నాడు హీరో నాగశౌర్య.

ఛలో కథ నేనే డెవలప్ చేసానని అంటున్నాడు నాగశౌర్య. దాంతో అక్కడే తేడా కొట్టి ఉంటుంది ఇద్దరికీ. ఇక ఇప్పుడేమో ఈ గొడవ మరింత ముదిరేలా కనబడుతోంది ఎందుకంటే నాగశౌర్య విమర్శించాడు కాబట్టి వెంకీ కూడా రియాక్ట్ కావడం ఖాయం. కాకపోతే అది ఇప్పుడు కాదు భీష్మ సినిమా విడుదల సమయంలో. ఎందుకంటే అప్పుడు తప్పకుండా స్పందించాల్సి ఉంటుంది దాంతో ఈ హీరోపై విమర్శలు చేయడం ఖాయం. అపుడు నాగశౌర్య కూడా ఇంకా రియాక్ట్ కావడం ఖాయం.