మిస్టర్ మజ్ను మొదటి రోజు వసూళ్లు

Published on Jan 28,2019 03:49 PM

అక్కినేని అఖిల్ - నిధి అగర్వాల్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్ నిర్మించిన చిత్రం '' మిస్టర్ మజ్ను ''. నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ సినిమా విడుదలైంది . అయితే పెద్దగా ఓపెనింగ్స్ లభించలేదు . షోలు స్టార్ట్ అయ్యాక మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో మెల్లిగా వసూళ్లు పెరిగాయి . నిన్న రెండు తెలుగు రాష్ట్రాలలో 3 కోట్ల షేర్ వసూల్ చేసింది మిస్టర్ మజ్ను చిత్రం . హైపర్ ఆది - ప్రియదర్శి ల కామెడీ , అఖిల్ డ్యాన్స్ , ఫైట్స్ , నిధి అగర్వాల్ గ్లామర్ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ని తెచ్చిపెట్టాయి . అయితే సూపర్ హిట్ అవ్వడం మాత్రం కష్టమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . 

ఫస్ట్ డే ఏపీ , తెలంగాణ లో వసూల్ అయిన షేర్  ఉన్నాయి . 

తెలంగాణ                   -  90 లక్షలు 

సీడెడ్                         - 42 లక్షలు 

ఉత్తరాంధ్ర                 -  41 లక్షలు 

ఈస్ట్ గోదావరి              -  20 లక్షలు 

వెస్ట్ గోదావరి               -  15 లక్షలు 

కృష్ణా                           -  26 లక్షలు 

గుంటూరు                   -  54 లక్షలు 

నెల్లూరు                      - 12 లక్షలు 

మొత్తం                      -  3 కోట్ల షేర్