ఈరోజు 6 సినిమాలు గోవిందా !

Published on Dec 06,2019 04:24 PM

ఈరోజు విడుదలైన 6 చిత్రాలు కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయాయి. డిసెంబర్ 6 న 6 చిత్రాలు విడుదల అయ్యాయి . వాటిలో కార్తికేయ నటించిన 90 ఎం ఎల్ , కమెడియన్ శ్రీనివాస రెడ్డి నటించి దర్శకత్వం వహించిన భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు , మిస్ మ్యాచ్ , మథనం , కలియుగ , అశ్వథామ చిత్రాలు ఉన్నాయి. అయితే వీటిలో కార్తికేయ 90 ఎం ఎల్ , శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు చిత్రాలపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే కానీ ఈరోజు విడుదలైన తర్వాత చూస్తే అన్ని సినిమాలు కూడా ప్లాప్ జాబితాలో చేరిపోయాయి.

90 ఎం ఎల్ పై కార్తికేయ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ అతడి ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. పాపం కార్తికేయ గతకొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. దాంతో ఈ 90 ఎం ఎల్ పై ఆశలు పెట్టుకున్నాడు కానీ పెద్ద దెబ్బే  కొట్టింది ఈ 90 ఎం ఎల్. ఈ సినిమాని కార్తికేయ నిర్మించడంతో ఆర్ధికంగా కూడా నష్టాలను తీసుకురానుంది.