కరోనా పై సినిమా : 21 డేస్ టైటిల్

Published on Apr 16,2020 06:58 PM
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది దాంతో కరోనా పై సినిమా తీయడానికి సిద్దమయ్యాడు విజయ్ భాస్కర్ అనే దర్శకుడు. అందుకోసం ఆన్ లైన్ లోనే ఆడిషన్స్ కూడా నిర్వహించడానికి సిద్దమైపోయాడట. కరోనా ఎఫెక్ట్ తో యావత్ ప్రపంచం తల్లకిందులయ్యింది. ఆర్ధిక పరిస్థితి కూడా దారుణంగా అయ్యింది అందుకే కరోనా పై సినిమా తీయడానికి సిద్ధమయ్యారు.

ఈ దర్శకుడే కాదు ఇంకా చాలామంది కరోనా పై సినిమాలు తీయడానికి స్క్రిప్ట్ లు సిద్ధం చేసుకుంటున్నారు. కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కరోనా మహమ్మారి పై సినిమాలను తీయడానికి రెడీ అవుతున్నారు కానీ సినిమా థియేటర్ లకు మాత్రం వెళ్ళడానికి జనాలు భయపడేలా ఉన్నారు. ఇంతకుముందులా అయితే వెళ్ళలేరు ఎందుకంటే ఎక్కడ కరోనా సోకుతుందో అన్న భయంతో.