చిరంజీవి - సుకుమార్ కాంబినేషన్ లో సినిమా

Published on Feb 12,2020 02:45 PM

మెగాస్టార్ చిరంజీవి కూడా జోరు పెంచుతున్నాడు. రీ ఎంట్రీలో ఖైదీ నెంబర్ 150 చిత్రంతో సంచలనం సృష్టించిన చిరంజీవి ఆ తర్వాత సైరా సమరసింహారెడ్డి చిత్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా తర్వాత ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఆచార్య సినిమా కంప్లీట్ అయ్యాక సుకుమార్ దర్శకత్వంలో నటించనున్నాడట చిరంజీవి. చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రానికి దర్శకుడు సుకుమార్ అన్న సంగతి తెలిసిందే.

రంగస్థలం చిత్రాన్ని చూసిన చిరంజీవి సుకుమార్ వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయ్యాడట. దాంతో అప్పుడే మన కాంబినేషన్ లో సినిమా చేద్దామని అన్నాడట. కట్ చేస్తే ఆ సినిమా 2021 లో కానీ 2022 లో కానీ చేయడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే తాజాగా అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు సుకుమార్. ఆ సినిమా తర్వాత చిరంజీవి కోసం పక్కగా స్క్రిప్ట్ వర్క్ చేయనున్నాడట సుకుమార్. ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే మెగా ఫ్యాన్స్ కు సంతోషమేగా !