ప్రభాస్ కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు

Published on Feb 22,2020 10:33 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు షాక్ ఇచ్చాడు మోహన్ బాబు. భక్త కన్నప్ప చిత్రాన్ని మంచు విష్ణు హీరోగా నిర్మించనున్నట్లు నిన్న అధికారికంగా ప్రకటించాడు మోహన్ బాబు దాంతో షాక్ అవ్వడం కృష్ణంరాజు , ప్రభాస్ ల వంతు అయ్యింది. 1976 లో తెలుగునాట విడుదలై సంచలన విజయం సాధించి కృష్ణంరాజుకు కెరీర్ లో మరిచిపోలేని విజయాన్ని అందించిన చిత్రం భక్త కన్నప్ప. అలాగే కృష్ణంరాజు కెరీర్ ని అగ్ర పథాన నిలబెట్టిన చిత్రం కూడా. అయితే ఈ చిత్రాన్ని ప్రభాస్ తో రీమేక్ చేయాలనీ కృష్ణంరాజు కోరిక.

కానీ ఆ కోరికపై నీళ్లు చల్లాడు మోహన్ బాబు. మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు ప్రకటించాడు మోహన్ బాబు దాంతో షాక్ అవ్వడం ప్రభాస్ ఫ్యాన్స్ వంతయ్యింది. మరి ఈ ప్రకటనపై కృష్ణంరాజు ఎలా స్పందిస్తాడో చూడాలి. సక్సెస్ లేక సతమతం అవుతున్న మంచు ఫ్యామిలీకి భక్త కన్నప్ప విజయాలను అందిస్తుందో చూడాలి.