మోహన్ బాబు ఆ చిత్రంలో నటించడం లేదట !

Published on Feb 13,2020 11:50 PM

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిరంజీవి తాజా చిత్రంలో నటించడం లేదని తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152 వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమాలో విలన్ గా మోహన్ బాబుని తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలన్నీ అబద్ధాలని మేము మోహన్ బాబుని సంప్రదించలేదని తెలిపాడు దర్శకులు కొరటాల శివ. గతంలో మోహన్ బాబు - చిరంజీవి కలిసి పలు చిత్రాల్లో హీరోలుగా నటించారు. అలాగే చిరు హీరోగా మోహన్ బాబు విలన్ గా కూడా నటించారు.

అయితే ఈమధ్య కాలంలో మాత్రం మోహన్ బాబు - చిరంజీవి కలిసి నటించలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అనుకున్నారు అభిమానులు కానీ వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయ్యాయి. చిరంజీవి రీ ఎంట్రీలో అదరగొడుతుండగా మోహన్ బాబు మాత్రం సైలెంట్ అయ్యాడు. మోహన్ బాబు అద్భుత నటుడు కానీ అతడికి తగిన పాత్రలు రాకపోవడంతో సినిమాలపై అంతగా ఆసక్తి కనబరచడం లేదు.