మోహన్ బాబు అప్పుల్లో ఉన్నాడా?

Published on Jan 23,2019 10:47 AM

విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు అప్పుల్లో ఉన్నాడా ? అంటే అవుననే వినిపిస్తోంది. వినిపించడమే కాదు స్వయంగా మోహన్ బాబు తన అప్పుల గురించి చెప్పాడు. మోహన్ బాబు కి చంద్రగిరి లో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ విద్యా సంస్థలో పనిచేసే వాళ్లకు జీతభత్యాల రూపంలో నెలకు 6 కోట్లు చెల్లించాల్సి వస్తోందని కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం బకాయి పడిన 20 కోట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 

ప్రభుత్వం రెండేళ్లుగా బకాయిలు ( ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ) ఇవ్వడం లేదని దాంతో బ్యాంక్ లో నా ఆస్థులను తాకట్టు పెట్టి మరీ జీతాలు ఇస్తున్నానని అంటున్నాడు మోహన్ బాబు. సినిమాల్లో బాగానే సంపాదించిన మోహన్ బాబు కు గతకొంత కాలంగా సినిమాలో కూడా నష్టాలు వచ్చాయి. నిర్మిస్తున్న అన్ని చిత్రాలు కూడా ప్లాప్ అవుతుండటంతో కాస్త ఆవేదనతో ఉన్నాడు మోహన్ బాబు.