కేజీఎఫ్ డైరెక్టర్ తో మహేష్ బాబు

Published on Sep 10,2019 11:53 AM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ని కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిశాడట హైదరాబాద్ లో దాంతో ఒక్కసారిగా ఊహాగానాలు చెలరేగాయి. మహేష్ బాబు తన తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ తోనే చేయనున్నాడు అని. తాజాగా కేజీఎఫ్ 2 హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరుపుకుంటోంది. కేజీఎఫ్ సంచలన విజయం సాధించడంతో దానికి సీక్వెల్ గా కేజీఎఫ్ 2 రూపొందుతున్న విషయం తెలిసిందే.

కన్నడ హీరో యష్ హీరోగా నటిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రాన్ని 2020 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఆ సినిమా అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ తో కానీ లేదా మహేష్ బాబు తో కానీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట కేజీఎఫ్ డైరెక్టర్. ప్రస్తుతం మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.