రాజమౌళిపై విమర్శలు చేసిన మిఠాయి డైరెక్టర్

Published on Apr 26,2020 04:24 PM
దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి పై యువ దర్శకులు మిఠాయి ఫేమ్ ప్రశాంత్ కిషోర్ సంచలన విమర్శలు చేసాడు. బాహుబలి చిత్రాన్ని ప్రపంచ స్థాయి దర్శకులు ఎవరు కూడా ప్రశంసించలేదని , పారా సైట్ చిత్రాన్ని విమర్శిస్తావా ? అంటూ నేరుగా రాజమౌళి పై విమర్శలను ఎక్కుపెట్టాడు ఈ దర్శకుడు. రాహుల్ రామకృష్ణ , ప్రియదర్శి ప్రధాన తారాగణంగా మిఠాయి అనే చిత్రాన్ని చేసాడు ఈ యువ దర్శకుడు. ఆ సినిమా ఘోర పరాజయాన్ని పొందింది.

ఇక రాజమౌళి విషయానికి వస్తే కరోనా నేపథ్యంలో ఖాళీగా ఉంటుండటంతో పారా సైట్ అనే చిత్రాన్ని చూశాడట. అయితే సినిమా కొద్దిసేపు చూసాక స్లో నేరేషన్ తో సాగుతోందని బోర్ కొట్టిందట దాంతో నిద్రపోయానని ట్వీట్ చేసాడు రాజమౌళి దాంతో నెటిజన్ల తో పాటుగా మిఠాయి దర్శకుడు కూడా విమరిస్తున్నాడు రాజమౌళిని.