ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి మైండ్ బ్లోయింగ్ ఆఫర్

Published on Dec 26,2019 05:27 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , రాంచరణ్ తేజ్ లు నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్ వస్తున్నాయి అన్ని ఏరియాల నుండి. ఎన్టీఆర్ , చరణ్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ఆపై ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి ఎక్కడా లేని క్రేజ్ వచ్చింది. దాంతో ఈ సినిమాని కొనడానికి పెద్ద ఎత్తున బయ్యర్లు పోటీ పడుతున్నారు. తాజాగా ఈ సినిమా తూర్పు గోదావరి జిల్లా హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. ఒక్క తూర్పు జిల్లా హక్కుల కోసమే ఈ సినిమాకు 13 కోట్ల ఆఫర్ ఇచ్చారట.

ఒక్క జిల్లా కే 13 కోట్ల బిజినెస్ అంటే నైజాం , సీడెడ్ , వెస్ట్ , నెల్లూరు , వైజాగ్ , కృష్ణా , గుంటూరు , ఓవర్ సీస్ , రెస్ట్ ఆఫ్ ఇండియా , కర్ణాటక , తమిళనాడు , కేరళ , అన్ని ఏరియాలతో పాటుగా శాటిలైట్ , ఆడియో , డిజిటల్ , హిందీ డబ్బింగ్ రైట్స్ కలుపుకొని 1000 కోట్ల సినిమా కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక తెలుగు సినిమాకు ఈ స్థాయి బిజినెస్ అంటే అది ముమ్మాటికీ ఎస్ ఎస్ రాజమౌళి ఖ్యాతి అనే చెప్పాలి. రాజమౌళి కి తోడుగా ఎన్టీఆర్ , చరణ్ ల స్టార్ డం కూడా తోడవ్వడం వల్ల అనూహ్యమైన బిజినెస్ చేయబోతోంది ఆర్ ఆర్ ఆర్. 350 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.