ఆచార్య కథని లీక్ చేసిన మెగాస్టార్

Published on Apr 15,2020 04:46 PM
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కథ ని లీక్ చేసాడు. తాను హీరోగా నటిస్తున్న చిత్ర కథని రివీల్ చేయకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి , కానీ ఆయనే తన సినిమా కథని లీక్ చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక దర్శకుడు కొరటాల శివ అయితే మరింతగా షాక్ అవుతున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆచార్య అనే టైటిల్ ని ఒక అకేషన్ లో ప్రకటించాలని అనుకున్నాడు కొరటాల కానీ చిరంజీవి ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ నోరు జారాడు దాంతో అవాక్కవడం కొరటాల వంతు అయ్యింది.

కట్ చేస్తే ఇప్పుడేమో ఆచార్య కథ రివీల్ చేసాడు. దేవాదాయ శాఖలో అలాగే అటవీశాఖలో జరుగుతున్న అవినీతిని ఎదురించే పాత్రలో నేను కనిపించనున్నాను అంటూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించాడు చిరు దాంతో దర్శకులు కొరటాల తల పట్టుకుంటున్నాడట. కొన్ని గుప్పిట ఉంటేనే మంచిదని కానీ చిరు మాత్రం అన్ని విషయాలు వెల్లడిస్తున్నారని అసంతృప్తితో ఉన్నాడట.