అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన మెగాస్టార్

Published on Dec 05,2019 01:52 PM

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఖంగుతినేలా ప్రశ్నించి షాక్ ఇచ్చాడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే పదేళ్ల క్రితం వచ్చిన జల్సా చిత్రంలో పవన్ కళ్యాణ్ హీరో కాగా ఆ చిత్రంలో విలన్ గా మమ్ముట్టి ని నటించాలని అడిగాడట నిర్మాత అల్లు అరవింద్. అయితే మమ్ముట్టి మాత్రం ఆగ్రహం వ్యక్తం చేయకుండా చాలా కూల్ గా ఓ ప్రశ్న వేసాడట అంతే అల్లు అరవింద్ కు ఫ్యుజ్ లు ఎగిరి పోయాయట ఆ ప్రశ్నతో.

ఇంతకీ మమ్ముట్టి ప్రశ్నించిన విషయం ఏంటో తెలుసా........ నన్ను విలన్ గా చేయమంటున్నారు ఓకే కానీ ఇదే ప్రశ్న ని చిరంజీవికి వేయగలరా ? మీరు విలన్ గా నటించాలని అడగగలరా ? అంటూ దాంతో షాక్ తిన్న అల్లు అరవింద్ సైలెంట్ అయిపోయాడట. తెలుగులో చిరంజీవి మెగాస్టార్ అయితే మలయాళంలో మమ్ముట్టి మెగాస్టార్ మరి అందుకే అలా ప్రశ్నించాడు.