నాని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మెగా ఫ్యాన్స్

Published on Feb 26,2019 05:04 PM

హీరో నాని పై మెగా అభిమానులు కోపంగా ఉన్నారు . ఇంతకీ నాని పై మెగా ఫ్యాన్స్ కు కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ....... గ్యాంగ్ లీడర్ అని టైటిల్ పెట్టుకోవడమే ! నాని తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి గ్యాంగ్ లీడర్ అని టైటిల్ పెట్టారు . అయితే చిరంజీవి నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్ కావడంతో అది ఒక్క మా బాస్ కు మాత్రమే ఆ టైటిల్ ని వాడుకునే అర్హత ఉందని నీకు లేదు అంటూ నాని పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . 

ఇక సోషల్ మీడియాలో అయితే నాని సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ట్వీట్ లు పెడుతూన్నారు . 1991 లో చిరంజీవి నటించిన చిత్రం గ్యాంగ్ లీడర్ . బ్లాక్ బస్టర్ అయిన గ్యాంగ్ లీడర్ తెలుగు చలనచిత్ర చరిత్ర ని తిరగరాసింది దాంతో ఆ టైటిల్ మెగా కుటుంబం మాత్రమే వాడుకోవాలంటున్నారు మెగా ఫ్యాన్స్ .