బోయపాటి ని తిడుతున్న మెగా ఫ్యాన్స్

Published on Feb 11,2019 05:54 PM

దర్శకులు బోయపాటి శ్రీను పై దాడి చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ . సోషల్ మీడియాలో అదేపనిగా బోయపాటి ని తిట్టడానికి కారణం ఏంటో తెలుసా ....... వినయ విధేయ రామ డిజాస్టర్ కావడమే కారణం .  జనవరి 11 న విడుదలైన వినయ విధేయ రామ ఘోర పరాజయం పొందింది అయితే అప్పటి నుండే బోయపాటి అంటే ఫైర్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్ . 

యితే తాజాగా మరింతగా రెచ్చిపోతున్నారు కారణం ఏంటంటే ...... చరణ్ - డివివి దానయ్య లు తలా 5 కోట్ల చొప్పున బయ్యర్లకు ఇవ్వడానికి ముందుకు వచ్చారు కానీ బోయపాటి డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడట దాంతో ఈ విషయం మెగా ఫ్యాన్స్ కి చేరడంతో బోయపాటి ని తిడుతున్నారు . దీని వెనకాల ఎవరో ఉన్నారని అందుకే ఇలా తిట్ల వర్షం కురుస్తోందని అంటున్నారు .