మీకు మాత్రమే చెప్తా టీజర్ రెడీ

Published on Sep 06,2019 11:31 AM

దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న చిత్రం '' మీకు మాత్రమే చెప్తా ''. హీరో విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కింగ్ ఆఫ్ ద హిల్ అనే ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్ర టీజర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ , అలాగే పోస్టర్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేసిన విజయ్ దేవరకొండ , తరుణ్ భాస్కర్ లు ఈ టీజర్ ని ఇంకెలా ప్లాన్ చేసారో సాయంత్రం తేలిపోనుంది.
ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే హాట్ భామ అనసూయ నటించడం. మీకు మాత్రమే చెప్తా లో అనసూయ విభిన్న పాత్ర పోషిస్తోంది. ఇక ఈ చిత్రానికి షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయమని భావిస్తున్నారు ఆ చిత్ర బృందం.