ఆకట్టుకుంటున్న మీకు మాత్రమే చెప్తా టీజర్

Published on Sep 07,2019 11:25 AM

నిన్న సాయంత్రం మీకు మాత్రమే చెప్తా టీజర్ విడుదల అయ్యింది , కాగా వినోదాత్మకంగా ఉన్న మీకు మాత్రమే చెప్తా టీజర్ మంచి వ్యూస్ సాధిస్తోంది, అందరినీ ఆకట్టుకుంటోంది. దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. పెళ్లిచూపులు చిత్రంతో దర్శకుడిగా పరిచయమై సంచలనం సృష్టించిన తరుణ్ భాస్కర్ మెగా ఫోన్ ని కాస్త పక్కన పెట్టి హీరోగా ట్రై చేస్తున్నాడు.
హాట్ భామ అనసూయ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని హీరో విజయ్ దేవరకొండ నిర్మించడం విశేషం. తనని హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్ కోసం విజయ్ దేవరకొండ నిర్మాతగా మారాడు. మీకు మాత్రమే చెప్తా అనే వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు పెరిగేలా కనబడుతున్నాయి.