విజయ్ దేవరకొండ నిర్మాతగా మీకు మాత్రమే చెప్తా

Published on Aug 29,2019 10:40 AM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి మీకు మాత్రమే చెప్తా అనే చిత్ర నిర్మాణానికి పూనుకున్నాడు. కాగా ఆ సినిమా టైటిల్ ని విభిన్నంగా ప్రకటించారు నిన్న సాయంత్రం. ఇక ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా ....... దర్శకులు దాస్యం తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు చిత్రానికి దర్శకత్వం వహించిన దాస్యం తరుణ్ భాస్కర్ మీకు మాత్రమే చెప్తా చిత్రంతో హీరోగా మారుతున్నాడు. 

పెళ్లిచూపులు చిత్రంలో హీరోగా తనని నిలబెట్టిన తరుణ్ భాస్కర్ కోసం నిర్మాతగా మారాడు విజయ్ దేవరకొండ. ఇక నిన్న సాయంత్రం విడుదల చేసిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉంది. ఈ టైటిల్ టీజర్ లో విజయ్ దేవరకొండ - తరుణ్ భాస్కర్ ల మధ్య సాగే సంభాషణ చాలా సరదాగా ఆకట్టుకునేలా సాగింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది , ఇప్పటికే ఫలక్ నుమా దాస్ తో పాటుగా మహానటి తదితర చిత్రాల్లో తరుణ్ భాస్కర్ నటించాడు కానీ ఫుల్ లెంగ్త్ హీరోగా నటిస్తోంది మాత్రం '' మీకు మాత్రమే చెప్తా '' .