మీడియానే నన్ను బ్యాడ్ బాయ్ ని చేసింది

Published on Apr 25,2020 08:20 AM
నేను మంచి వాడినే కానీ మీడియానే నన్ను బ్యాడ్ బాయ్ గా చిత్రీకరించింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు నటుడు నవదీప్. టాలీవుడ్ లో వివాదాస్పద నటుడిగా పేరున్న నవదీప్ నేను మంచివాడని కానీ కొన్ని చిన్న చిన్న తప్పుల మూలంగా నన్ను బ్యాడ్ బాయ్ గా చూపించారని అందుకు మీడియానే కారణమని అంటున్నాడు. 2004 లో తేజ దర్శకత్వంలో వచ్చిన జై చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు నవదీప్.

అయితే కెరీర్ ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు దాంతో ఒకవైపు వెబ్ సిరీస్ లు చేస్తూనే సినిమాల్లో విలన్ గా , సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. ఇకపై నా కెరీర్ ని జాగ్రత్త పర్చుకుంటానని , ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అంటున్నాడు. కుర్రతనం వల్ల నవదీప్ చేసిన కొన్ని పనులు చాలా వివాదాన్నే తెచ్చిపెట్టాయి దాంతో హీరోగా అవకాశాలు తగ్గాయి ఈ నటుడికి. దాంతో నెగెటివ్ క్యారెక్టర్లు , సపోర్టింగ్ క్యారెక్టర్లు పోషిస్తున్నాడు.