హిట్ బాట పట్టిన మర్దానీ 2

Published on Dec 14,2019 04:59 PM

బాలీవుడ్ భామ రాణీ ముఖర్జీ నటించిన మర్దానీ 2 హిట్ బాట పట్టింది. నిన్న విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. డిసెంబర్ 13న విడుదలైన మర్దానీ 2 కి దాదాపు 7 కోట్ల వసూళ్లు వచ్చాయి. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి సైతం 7 కోట్ల వసూళ్లు వచ్చాయంటే ఈ సినిమా ట్రైలర్ కు వచ్చిన స్పందనే కారణం అని అంటున్నారు. ఇంతకుముందు వచ్చిన మర్దానీ సూపర్ హిట్ కాగా దానికి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. రాణీ ముఖర్జీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రం యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.

మంచి రివ్యూస్ తో పాటుగా నటిగా రాణీ ముఖర్జీ ప్రదర్శించిన నటనకు ప్రేక్షకులతో పాటుగా క్రిటిక్స్ కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. ఇక రాణీ ముఖర్జీ నటనకు జేజేలు పలుకుతున్నారు. విమర్శకుల ప్రశశంసలు అందుకుంటున్న మర్దానీ 2 తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీ పుత్రన్ దర్శకత్వం వహించాడు.