యాభై దేశాల్లో విడుదల అవుతున్న మణికర్ణిక

Published on Jan 24,2019 12:31 PM

వివాదాస్పద భామ కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది . ఇక ఈ సినిమా 50 దేశాలలో రిలీజ్ అవుతోంది . క్రిష్ జాగర్లమూడి - కంగనా రనౌత్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం . వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . 

70 శాతానికి పైగా క్రిష్ దర్శకత్వం వహించగా మిగిలిన భాగాన్ని కంగనా రనౌత్ పూర్తిచేసింది . గత ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కొన్ని అవాంతరాల వల్ల జనవరి 25 కు మారింది . ఈ సినిమాకు కథకుడు విజయేంద్ర ప్రసాద్ కావడం విశేషం . రేపు ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో కంగనా కు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసారు పోలీసులు .