భార్యని తలచుకొని ఏడ్చిన మంచు విష్ణు

Published on Apr 02,2020 03:29 PM
భార్యాపిల్లలను తలచుకొని ఏడ్చాడు హీరో మంచు విష్ణు. భార్యాపిల్లలను తలచుకొని హీరో ఏడవడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? లాక్ డౌన్ నేపథ్యంలో హీరో మంచు విష్ణు ఇండియాలో ఉండగా భార్యాపిల్లలు మాత్రం అమెరికాలో ఉన్నారు. ఫిబ్రవరిలో వెరోనికా తన నలుగురు పిల్లలతో కలిసి అమెరికా వెళ్ళింది. అక్కడ సమీప బంధువులకు ఆపరేషన్ ఉండటంతో అక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో వాళ్ళు అమెరికాలోనే ఉండిపోయారు.

వాళ్ళు దూరంగా ఉండటంతో నాకు నిద్ర పట్టడం లేదని , భార్యా పిల్లలు గుర్తుకు వస్తున్నారని కన్నీళ్ల పర్యంతం అయ్యాడు మంచు విష్ణు. అయితే కరోనా మహమ్మారి రాజుకుంటున్న నేపథ్యంలో లాక్ డౌన్ మన మంచికే కాబట్టి ఈ విరహం తప్పదని తనకు తానె సర్ది చెప్పుకుంటున్నాడు ఈ హీరో. విష్ణు - వెరోనికా లు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. విరోనికా ఏపీ సీఎం జగన్ కు సోదరి అవుతుందన్న విషయం కూడా విదితమే !