సొంత ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేస్తున్న మంచు మనోజ్

Published on Oct 28,2019 04:58 PM

మంచు మనోజ్ కొత్త అవతారం ఎత్తడానికి సిద్దమయ్యాడు. ఇన్నాళ్లు హీరోగా నటించిన మంచు మనోజ్ ఇకపై నిర్మాతగా మారుతున్నాడు. మంచు మనోజ్ సొంత ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేస్తున్నట్లు నిన్న ప్రకటించాడు. ఇకపై ఎం ఎం బ్యానర్ పైయంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ చిత్ర నిర్మాణానికి సిద్ధం అవుతున్నానని తెలిపాడు మంచు మనోజ్.
       మోహన్ బాబు తనయుడిగా తెరంగేట్రం చేసిన మంచు మనోజ్ హీరోగా 12 ఏళ్లకు పైగా పలు చిత్రాల్లో నటించాడు అయితే అనుకున్న స్థాయిలో హీరోగా విజయం సాధించలేకపోయాడు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ప్రణతి రెడ్డి తో తీవ్ర విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. దాంతో కెరీర్ డోలాయమానంలో పడింది కాబట్టి ఇలా మరో మార్గాన్ని ఎంచుకుంటున్నాడు మంచు మనోజ్.