మంచు మనోజ్ విడాకులకు రీజన్ ఏంటంటే .....

Published on Oct 20,2019 04:16 PM
హీరో మంచు మనోజ్ తన భార్య ప్రణతి రెడ్డి కి విడాకులు ఇచ్చిన విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. అయితే ఈ ఇద్దరూ విడిపోయి చాలా కాలమే అవుతోంది అని అంటున్నారు సన్నిహిత వర్గాలు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మంచు మనోజ్ - ప్రణతి రెడ్డి లు ఎందుకు విడిపోయారో తెలుసా ........ మంచు మనోజ్ కెరీర్ లో ఇబ్బందులు పడటమే ! తన వదిన అయిన వెరోనికా రెడ్డి కి స్నేహితురాలు అయిన ప్రణతి రెడ్డి ని ప్రేమించాడు మంచు మనోజ్.

ప్రణతి కూడా మనోజ్ ని ప్రేమించింది దాంతో ఇరు కుటుంబాల పెద్దలు వీళ్ళ ప్రేమని ఆశీర్వదించారు. కట్ చేస్తే మంచు మనోజ్ కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మోహన్ బాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్ కు సాలిడ్ హిట్ అంటూ ఒక్కటి కూడా లేదు అది వైవాహిక జీవితం పై పడింది దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇంకేముంది ప్రణతి ఏడాది కిందటే మనోజ్ నుండి విడిపోయింది. అయితే అధికారికంగా విడాకులు తీసుకున్న తర్వాత ఈ విషయాన్నీ వెల్లడించాడు మంచు మనోజ్. ఇకపై కెరీర్ పై దృష్టి పెడతానని అంటున్నాడు మరి, కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.