హమ్మయ్య ! మంచు మనోజ్ సినిమా స్టార్ట్ కాబోతోంది

Published on Feb 13,2020 11:48 PM

హమ్మయ్య ! ఎట్టకేలకు మంచు మనోజ్ సినిమా స్టార్ట్ కాబోతోంది ఎట్టకేలకు. మూడేళ్ళ పాటు సినిమా రంగానికి దూరంగా ఉంటూ వచ్చిన ఈ హీరో తన పేరుతో సొంత బ్యానర్ పెట్టుకున్నాడు ఎం ఎం ఆర్ట్స్ ( మంచు మనోజ్ ఆర్ట్స్ ). ఈ బ్యానర్ పై మొదటి ప్రయత్నంగా '' అహం బ్రహ్మాస్మి '' అనే చిత్రాన్ని చేయనున్నాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మార్చ్ 6 నుండి ఈ సినిమా ప్రారంభం సెట్స్ మీదకు వెళ్లనుంది.

2004 లో హీరోగా పరిచయం అయ్యాడు మంచు మనోజ్. అప్పటి నుండి దాదాపు 16 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నాడు కానీ మధ్యలో మూడేళ్ళుగా ఎలాంటి సినిమాలు చేయలేదు. ఆశించిన స్థాయిలో సినిమాలు ఆడకపోవడం ఒకటైతే కాపురంలో చెలరేగిన కలతలు కూడా మరో కారణం అయ్యింది. అయితే ఆ బాధలను నుండి బయటపడిన ఈ హీరో అహం బ్రహ్మాస్మి అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.