స్పైసీ షోకి తెరలేపిన మంచు లక్ష్మీ

Published on Sep 19,2019 10:33 AM

మంచు లక్ష్మి స్పైసీ షోకి తెరలేపింది, ఇప్పటికే బుల్లితెరపై పలు రియాలిటీ షోలు నిర్వహించిన అనుభవం మంచు లక్ష్మీ కి ఉంది , ఆ అనుభవంతో తాజాగా వూట్ అనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కోసం ఓ రియాలిటీ షో చేస్తోంది. ఈ షో ఈనెల 23 నుండి ప్రారంభం కానుంది ఫీట్ అప్ విత్ స్టార్స్ అనే టైటిల్ తో. ఈ షో ఆసాంతం స్పైసీ గా సాగనుంది అని ప్రోమో చూస్తే తెలిసిపోతోంది.
కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , వరుణ్ తేజ్ , సమంత లతో మంచు లక్ష్మీ చేసిన సందడి యువతని పిచ్చెక్కించేలా ఉంది. బెడ్ రూం , బాత్ రూం రహస్యాలు బయట పడేలా ఉన్నాయి ఈ షో వల్ల. అయితే ఈ కార్యక్రమాన్ని చూడాలంటే వూట్ ఆప్ ని డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. లేకపోతే చూడటం కష్టమే. తాజాగా మంచు లక్ష్మీ రిలీజ్ చేసిన ప్రోమో యమా హాట్ గా ఉంది మరి.