బాలయ్య కు సవాల్ విసిరిన మంచు లక్ష్మీ

Published on Nov 29,2019 04:47 PM

మంచు లక్ష్మీప్రసన్న నందమూరి బాలకృష్ణ కు సవాల్ విసిరింది. అయితే ఆ సవాల్ ని బాలయ్య స్వీకరిస్తాడా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అనే చెప్పాలి ఎందుకంటే ఇది గ్రీన్ ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమమే అయినప్పటికీ ఈ గ్రీన్ ఛాలెంజ్ ని ప్రారంభించింది తెలంగాణ రాష్ట్రానికి చెందిన  రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు అయిన జోగినపల్లి సంతోష్ కుమార్ స్టార్ట్ చేసాడు గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని.

యాంకర్ సుమ మూడు మొక్కలు నాటి మంచు లక్ష్మీప్రసన్న కు ఈ సవాల్ విసరగా దాన్ని స్వీకరించిన మంచు లక్ష్మీ మూడు మొక్కలు నాటి బాలకృష్ణ కు అలాగే మంచు మనోజ్ కు రకుల్ ప్రీత్ సింగ్ కు సవాల్ విసిరింది. మంచు మనోజ్ , రకుల్ ప్రీత్ సింగ్ లు ఎలాగూ ఆ సవాల్ ని స్వీకరిస్తారు కానీ బాలయ్య ఛాలెంజ్ స్వీకరిస్తాడా ? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.