యష్ హత్యకు కుట్రచేసిన వాడు ఎన్ కౌంటర్

Published on Mar 01,2020 03:43 PM

కన్నడ స్టార్ హీరో యష్ ని హత్య చేయాలనీ చూసిన ఆగంతకుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది. కన్నడంలో ఎవరూ ఊహించని విధంగా స్టార్ డంని సొంతం చేసుకున్న సమయంలో అతడ్ని చంపాలని రౌడీషీటర్ భరత్ చంపాలని ప్లాన్ చేసాడట. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో రెక్కీ నిర్వహించినప్పటికీ సైలెంట్ అయిపోయాడు రౌడీషీటర్.

కట్ చేస్తే అతడి ఆచూకీ లభించడంతో అరెస్ట్ చేసి కర్ణాటక తరలించారు. అయితే ఓ నేరం విషయంలో సంఘటనని రీ కంస్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దాంతో పోలీసులు ఫైర్ ఓపెన్ చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి రౌడీషీటర్ భరత్ కు . అతడ్ని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తున్న సమయంలో ఆరోగ్యం విషమించి చనిపోయాడు. సాధారణ కుటుంబం నుండి వచ్చిన యష్ ఎవరూ ఊహించని స్టార్ డం అందుకున్నారు.