మలైకా కాపురాన్ని కూల్చిన డ్రైవర్

Published on Jan 24,2019 11:49 AM

హాట్ భామ మలైకా అరోరా కాపురాన్ని కూల్చింది ఎవరో తెలుసా ....... ఆమె డ్రైవరే ! అవును ఆమె డ్రైవర్ వల్లే మలైకా కాపురం కూలిపోయింది . సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని మలైకా పెళ్లాడిన విషయం తెలిసిందే . 17 సంవత్సరాల పాటు కాపురం కూడా చేసారు , వాళ్ళ కాపురానికి గుర్తుగా 14 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు . అయితే అర్భాజ్ కు విడాకులు ఇవ్వకుండానే యంగ్ హీరో అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మొదలు పెట్టింది మలైకా . 

ఆ విషయాలను ఎప్పటికప్పుడు మలైకా డ్రైవర్ అర్భాజ్ ఖాన్ డ్రైవర్ కు చెప్పేవాడట ! మలైకా అర్జున్ కపూర్ తో  ఎక్కడికి వెళ్తోంది ,ఎలా ఎంజాయ్ చేస్తోంది అన్న విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడట దాంతో మలైకా కు అర్భాజ్ కు గడవలు అయి విడాకులు తీసుకున్నారు . ఇక ఇపుడేమో ఏకంగా మలైకా - అర్జున్ లు సహజీవనం చేస్తున్నారు . త్వరలోనే పెళ్లి కూడా చేసుకోనున్నారట మలైకా - అర్జున్ కపూర్ లు .