మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న భామ

Published on Apr 05,2019 05:06 PM

45 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిన భామ మలైకా అరోరా . తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవులలో పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తోంది . ఏప్రిల్ 19 న బాలీవుడ్ కుర్ర హీరో అర్జున్ కపూర్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్దమవుతున్న నేపథ్యంలో బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి మాల్దీవులకు వెళ్ళింది మలైకా అరోరా . 

మాల్దీవులకు ఫ్రెండ్స్ తో వెళ్లిన మలైకా అక్కడ వీర లెవల్లో రెచ్చిపోతూ మద్యం పార్టీలో తెగ హంగామా చేస్తున్నారు . మలైకా తో పాటుగా పలువురు వెళ్లారు . అక్కడ ఎంజాయ్ చేస్తున్న తీరుకి షాక్ అవుతున్నారు నెటిజన్లు . అర్జున్ కపూర్ తనకంటే 13 ఏళ్ళు చిన్నవాడు అయినప్పటికీ ప్రేమించి మరీ పెళ్లి చేకుంటోంది మలైకా . అర్జున్ కపూర్ తో కలిసి జీవించడానికి భర్త అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇచ్చింది . 

మలైకా అరోరా కు 14 ఏళ్ల కొడుకు కూడా ఉన్న విషయం తెలిసిందే . ఇక మలైకా రెండో పెళ్ళికి ఆమె కుటుంబ సభ్యులు కూడా మద్దతుగా నిలిచారు . దాంతో ఈనెల 19 న మలైకా - అర్జున్ కపూర్ లు ఒక్కటి కానున్నారు.