మరో భామకు లిప్ లాక్ ఇచ్చిన నాగచైతన్య

Published on Feb 14,2019 12:42 PM

నాగచైతన్య - సమంత కలిసి జంటగా నటిస్తున్న తాజా చిత్రం మజిలీ . నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ని ఈరోజు ప్రేమికుల దినోత్సవంని పురస్కరించుకొని రిలీజ్ చేసారు . ఇక టీజర్ చూస్తుంటే తప్పకుండా ప్రేక్షకులను అలరించేలాగే ఉంది . మరో షాకింగ్ ఏంటంటే నాగచైతన్య సమంత కు కాకుండా  మరో భామకు లిప్ లాక్ ఇవ్వడం.

పెళ్ళికి ముందు , పెళ్ళికి తర్వాత కథాంశంతో తెరకెక్కుతోంది ఈ మజిలీ చిత్రం . ఇక వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలే దొరుకుతారు అంటూ పోసాని చెప్పే డైలాగ్ డైనమైట్ లా పేలింది . ఈ మజిలీ చిత్రాన్ని ఏప్రిల్ 5 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . నాగచైతన్య కు గతకొంత కాలంగా సక్సెస్ లు లేకుండా పోయాయి . దాంతో ఇప్పుడు సమంత రూపంలో నాగచైతన్య కు హిట్ వస్తుందో చూడాలి . 

టీజర్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి