మజిలీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Published on Apr 13,2019 10:24 AM

అక్కినేని నాగచైతన్య - సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్ లో 26 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది . నాగచైతన్య కెరీర్ లోనే బెస్ట్ వసూళ్ల ని సాధించి మజిలీ కెరీర్ బెస్ట్ గా నిలిచింది . నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ ఏప్రిల్ 5న విడుదలైన విషయం తెలిసిందే . 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లో కూడా మంచి వసూళ్ల ని సాధిస్తోంది మజిలీ . మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది దాంతో బయ్యర్లు లాభాల బాటలోకి వచ్చారు . 

ఏరియాల వారీగా మజిలీ ఫస్ట్ వీక్ షేర్ ఇలా ఉంది . 

నైజాం                        -  9. 05 కోట్లు 

సీడెడ్                        -  2. 82 కోట్లు 

ఈస్ట్                           -  1. 30 కోట్లు 

వెస్ట్                            -  99 లక్షలు 

ఉత్తరాంధ్ర                -   3. 07 కోట్లు 

నెల్లూరు                    -   57 లక్షలు 

కృష్ణా                         -   1. 45 కోట్లు 

గుంటూరు                 -  63 లక్షలు 

రెస్ట్ ఆఫ్ ఇండియా    - 2. 50 కోట్లు 

ఓవర్ సీస్                  -  2. 75 కోట్లు 

మొత్తం                      -  26 .13 కోట్లు