ప్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్న మహేష్ బాబు

Published on Aug 22,2019 03:53 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే . కాగా ఇప్పటికే ఓ సినిమాని ప్రకటించిన మహేష్ బాబు తాజాగా వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నాడు . ఇక ఆ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా ..... ప్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ అట ! మెహర్ రమేష్ తెలుగులో చాలా చిత్రాలే చేసాడు కానీ హిట్ ఒకటి ఉంటే మిగతా సినిమాలన్నీ డిజాస్టర్ లు అయ్యాయి దాంతో దర్శకుడిగా అతడికి సినిమాలు లేకుండాపోయాయి కట్ చేస్తే మహేష్ బాబు కు సన్నిహితుడు కాబట్టి వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది . ఇక నిర్మాణ వ్యవహారాలు అన్ని కూడా మహేష్ భార్య నమ్రత చూసుకుంటున్న విషయం తెలిసిందే . మహేష్ కు సన్నిహితుడు కాబట్టే వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందని అంటున్నారు . మరి ఈ ఛాన్స్ తోనైనా మెహర్ రమేష్ సక్సెస్ కొడతాడేమో చూడాలి .