కేజీఎఫ్ డైరెక్టర్ తో మహేష్ బాబు

Published on Mar 12,2019 02:29 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు యువ దర్శకులు కేజీఎఫ్ ఫేమ్  ప్రశాంత్ నీల్ . కన్నడ చిత్రం కేజీఎఫ్ తో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు తాజాగా కేజీఎఫ్ చాప్టర్ 2 కి శ్రీకారం చుడుతున్నాడు . కాగా ఇదే సమయంలో మహేష్ బాబు తో సినిమా చేయాలనే ఆలోచనతో నమ్రత ని కలిసి ఔట్ లైన్ చెప్పాడట దాంతో పక్క స్క్రిప్ట్ తో రండి తప్పకుండా సినిమా చేద్దామని చెప్పారట . 

మహేష్ బాబు తో సినిమా చేస్తే ఆ రేంజ్ వేరు కదా ! అందుకే ప్రశాంత్ నీల్ మహేష్ ని టార్గెట్ చేసాడు . ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి చిత్రం చేస్తున్నాడు అది పూర్తయ్యాక అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించనున్నాడు . అది కూడా పూర్తి అయితే కానీ తెలీదు తదుపరి సినిమా ఎవరితో ఉంటుందో అన్నది . మహర్షి చిత్రాన్ని మే 9 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .