మహేష్ బాబు టీజర్ పై భారీ అంచనాలు

Published on Nov 22,2019 04:27 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ చిత్ర టీజర్ ని ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు చిత్ర బృందం. రేపు దర్శకులు అనిల్ రావిపూడి పుట్టినరోజు దాంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ టీజర్ పై మహేష్ బాబు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అందుకే చరిత్ర సృష్టించడానికి వస్తున్నాం అంటూ ట్వీట్ చేసాడు.
                 మహేష్ బాబు సరసన రష్మిక మందన్న నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో విజయశాంతి , ప్రకాష్ రాజ్ లు నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 12న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర నేపథ్యం రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం కావడం విశేషం. ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు మళ్ళీ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో చేస్తున్న సినిమా ఈ సరిలేరు నీకెవ్వరు.