KGF డైరెక్టర్ కు చుక్కలు చూపిస్తున్న మహేష్

Published on Feb 18,2020 06:56 PM

KGF కన్నడ చిత్రంతో యావత్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాంటి దర్శకుడితో సినిమా చేయడానికి ఎలాంటి స్టార్ హీరో అయిన వెంటనే ఓకే చెప్పాలి కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ప్రశాంత్ నీల్ కు చుక్కలు చూపిస్తున్నాడు. KGF బ్లాక్ బస్టర్ అయ్యాక మహేష్ బాబు తో సినిమా చేయాలనీ భావించాడు ఈ దర్శకుడు అందుకే మహేష్ ని కలిసి ఓ కథ చెప్పాడట అది నచ్చలేదు దాంతో మరో కథ కూడా చెప్పాడట అది కూడా నచ్చకపోవడంతో మహేష్ చుట్టూనే తిరుగుతున్నాడు పాపం.

అలాగే ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయాలనీ భావించిన ప్రశాంత్ నీల్ అతడ్ని కలిశాడట ! సేమ్ టు సేమ్ ఎన్టీఆర్ కూడా అంత తొందరగా ఛాన్స్ ఇవ్వడం లేదు , గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో చేసేదిలేక KGF సీక్వెల్ చేస్తున్నాడు. ఆ సినిమా అయ్యాక అయినా మహేష్ బాబు , ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరు ఛాన్స్ ఇవ్వకపోతారా ? అని ఆశగా ఎదురు చూస్తున్నాడట. KGF వంటి సూపర్ హిట్ చిత్రాన్ని చేసి కూడా ప్రశాంత్ ఇబ్బంది పడుతున్నాడట.