100 మిలియన్స్ అందుకొని చరిత్ర సృష్టించిన మహేష్

Published on Apr 18,2020 03:49 PM
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం 100 మిలియన్ వ్యూస్ ని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒక ప్రాంతీయ భాషా చిత్రం నేరుగా 100 మిలియన్ వ్యూస్ ని అందుకున్న సినిమాలు ఇంతవరకు దక్షిణాదిలోనే లేవు , ఆ అరుదైన ఘనతని మహేష్ బాబు అందుకున్నాడు శ్రీమంతుడు చిత్రంతో. మహేష్ బాబు కున్న స్టామినాతో ఈ రికార్డ్ సాధ్యమైంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. శృతి హాసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. చక్కని సందేశంతో పాటుగా కమర్షియల్ అంశాలను మేళవించి శ్రీమంతుడు చిత్రాన్ని రూపొందించాడు కొరటాల. ఇక ఈ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రానికి మహేష్ బాబు స్టార్ డం తోడయ్యింది దాంతో అవలీలగా యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ కొల్లగొట్టేసింది. సౌత్ ఇండియాలోనే ఇలాంటి అరుదైన రికార్డ్ సాధించిన హీరోలు లేరు ఒక్క మహేష్ బాబు తప్ప.