లాస్ట్ షెడ్యూల్ కి సిద్ధం కానున్న మహేష్

Published on Oct 21,2019 03:34 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతి కి గాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 12 న విడుదల కానున్న ఈ చిత్రం తాజాగా విలన్ కు మహేష్ బాబు కు మధ్య సాగే కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకులు అనిల్ రావిపూడి.
యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యిందని ఇక లాస్ట్ షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ గా ఉందని దాన్ని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేసాడు అనిల్ రావిపూడి. మహేష్ బాబు మిలిటరీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఫ్యాక్షన్ నేపథ్యం కూడా ఉంది అందుకే కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ కూడా వేశారు ఈ చిత్రం కోసం. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో విజయశాంతి నటిస్తోంది చాలాకాలం తర్వాత.